ఘనంగా జన సమితి ఆవిర్భావ వేడుకలు

  హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :    తెలంగాణ జన సమితి ఏడవ ఆవిర్భావ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. అడిక్‌మెట్‌ డివిజన్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కాకునూరి సుధాకర్ ఆధ్వర్యంలో రాంనగర్ గుండు వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని,...