Addam News
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 5:48 am Posted by : Addam News

బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం – బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు

బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం

– బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :      బిసిలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌ని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వ‌జ‌మెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ బిసి జేఏసి సంఘాల పిలుపుమేర‌కు శ‌నివారం తెలంగాణ బంద్‌లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రాస్తారోకో నిర్వహించి రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో లో మాజీ మంత్రి, సనత్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వాద్దిరాజు రవిచంద్ర, మాజీ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, చింత ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు పల్లె రవికుమార్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, అంజనేయులు గౌడ్‌, దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, తుల ఉమ, రాజయ్య యాదవ్‌, యువ నాయకుడు ముఠా జయసింహ, ప‌లు డివిజన్ల‌ అధ్యక్షులు, కార్యకర్తలు బీసీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ… బీసీ సంఘాలు చేపట్టిన “బీసీ బంద్‌” కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. బీసీలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే బీసీల న్యాయ హక్కులు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అంశాన్ని పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png