Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:03 am Posted by : Addam News

భగ‌త్‌సింగ్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి – భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ )

భగ‌త్‌సింగ్‌ ఆశయ బాటలో నేటి యువత పయనించాలి
భగ‌త్‌సింగ్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి
– భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ )

హిమాయ‌త్‌న‌గ‌ర్‌, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) :    భగ‌త్‌సింగ్‌ ఆశయ బాటలో నేటి యువత పయనించాలని, భగ‌త్‌సింగ్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) నాయ‌కులు కోరారు. భగ‌త్‌సింగ్‌ ఘనంగ 119 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హిమాయ‌త్‌న‌గ‌ర్ నుంచి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం వ‌ర‌కు భారీ ర్యాలీని నిర్వ‌హించారు. ఈ ర్యాలీని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి, నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాలన్నారు.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మరణం ఈ దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని, యువతరాన్ని మేల్కోలిపిందని, చైతన్యాన్ని రగిలించిందని పేర్కొన్నారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, ప్రజల బ్రతుకుల్లో అనువంతైన మార్పు రాలేదని, పేదరికం, దోపిడి పోలేదని, విద్య, వైద్యం ఉద్యోగం, దున్నేవానికి భూమి, గిట్టుబాటు ధరలు, ఆడపిల్లల జీవితాలకు భద్రత ఇంకెన్నో మరెన్నో సమస్యలు తీరే దారి కనుచూపుమేరలో కానరావడంలేదన్నారు. కేంద్ర, అమరజీవి భగ‌త్‌సింగ్‌ అందించిన స్ఫూర్తితో యువత నడుము కట్టాలని, పిడికిలెత్తాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమన్, నాగేందర్, రజనీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శులు ఆంజనేయులు, ప్రవీణ్, జిల్లా నాయకులు భరత్, కార్తీక్, అశ్వక్, సాయి, ప్రవీణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.