Addam News
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 2:03 pm Posted by : Addam News

TRS : ఛ‌లో కొడంగల్ – పాంచజన్య సంకల్ప సభను విజ‌య‌వంతం చేయండి

ఛ‌లో కొడంగల్ – పాంచజన్య సంకల్ప సభను విజ‌య‌వంతం చేయండి
– తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ పార్టీ ) గ్రేట‌ర్ హైద‌రాబాద్ యువ‌జ‌న నాయ‌కుడు, ముషీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ప‌ర‌కాల మ‌నోజ్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   ఈ నెల 20వ తేదీన కొడంగ‌ల్‌లో జ‌రుగ‌నున్న పాంచ‌జ‌న్య సంకల్ప స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ పార్టీ ) గ్రేట‌ర్ హైద‌రాబాద్ యువ‌జ‌న నాయ‌కుడు, ముషీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ప‌ర‌కాల మ‌నోజ్ కుమార్ గౌడ్ కోరారు. ఆయ‌న ముషీరాబాద్‌లో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రశ్నించేందుకు తెలంగాణ ర‌క్ష‌ణ సేన ( టిఆర్ఎస్ పార్టీ ) అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌లో “ పాంచజన్య సంకల్ప సభ ” ఈ ను నిర్వ‌హించ‌నున్నార‌ని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారుల సమస్యలపై ప్రజా గొంతుకగా ఈ సభలో ప్రశ్నించేందుకు మనమంతా ఒక్కటై ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని మ‌నోజ్ గౌడ్ కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png