Addam News
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 12:15 pm Posted by : Addam News

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమం

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమం


హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ సబర్మతినగర్ బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయం 41 రోజుల సంద‌ర్భంగా మండ‌ల దీక్ష సంద‌ర్భంగా గురువారం చండీ హోమం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జరిగింది. ఈ చండీ హోమానికి ముఖ్య అతిథులుగా వేర్వురుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్‌ విన‌య్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింగ్ రావు, నర్సింగ్ ముదిరాజ్, జి వై.గిరి, టి.యాదగిరి, వై.లక్ష్మయ్య, చంద్ర శేఖర్, రాజ్, కుమార్, ధన రాజ్, భాస్కర్, భక్తులు వాణి, అనిత, మల్లీశ్వరి, పూజ, రేణుక, భార్గవి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, రాకేష్‌, శ్రీకాంత్‌, బిజెపి నాయ‌కులు ఆనంద్‌రావు, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png