చిక్కడపల్లి, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో వద్ద శనివారం చండీ హోమాన్ని జరిగింది. విశ్వ కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహించిన ఈ చండీ హోమంలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపన అధ్యక్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు పలుస బాల్రాజ్ గౌడ్ హోమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ, తమ్మన కృష్ణమూర్తి, రాపర్తి రాజగోపాల్, కిరణ్ కుమార్, పెండ్యాల చందర్, రాపర్తి వెంకట ప్రవీన్ కుమార్, రాజ్ కిరణ్, నర్సింగ్ రావు, పాశం లక్ష్మణరావు, డి.చంద్రమోహన్ గౌడ్, పి.శివకృష్ణ, వీణా దేవి, అన్నపూర్ణ హాజరై తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ ఆనంద పీఠాధ్యక్షులు, ఆత్మబంధు ఆచార్య డాక్టర్.పులిగడ్డ హనుమంతరాయ శర్మ పర్యవేక్షణలో హంస అవార్డు గ్రహీతలు నాగరాజ శర్మ, మయూర అవార్డు గ్రహీతలు సాయినాథ శర్మ సహకారంతో అమ్మవారికి పూజలు జరిగాయి.
