రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన హర్షణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన హర్షణీయమని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల టిడిపి కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. వాస్తవంగా తెలంగాణలోనే...