Addam News
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 10:21 am Posted by : Addam News

ఈ నెల 20న చంద్రబాబు నాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుక‌ల‌ను ఈ నెల 20వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర టిడిపి కార్యాయ‌లంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… చంద్ర‌బాబునాయుడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా నగర పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమ తమ నియోజకవర్గ, డివిజన్ ప్రాంతాలలో పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షిస్తూ వారి గోత్రమైన “పునగనీల” పేరిట దేవాలయాలలో అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, మసీదు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టాలని కోరారు. అదే విధంగా తమ తమ శక్తి మేరకు ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణి, స్వీట్లు పంపిణీ, కేక్ కటింగ్, పేద విద్యార్థుల‌కు నోట్ బుక్‌ల పంపిణి కార్యక్రమాలను చేపట్టాలని సాయిబాబా పిలుపు నిచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగే జన్మదిన వేడుకలకు తప్పక హాజరు కావాలని కోరారు. కార్యకర్తలు నాయకులు చేపట్టిన కార్యక్రమ వివరాలను ఫోటోతో పాటు జిల్లా పార్టీ కార్యాలయం 9989511065 ఫోన్ నంబ‌ర్‌ వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png