తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యుడిగా చేపూరి వెంకటేశ్వరరావు నియామ‌కం

సికింద్రాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యుడిగా సికింద్రాబాద్‌కు చెందిన చేపూరి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు ఆదివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పదవి ఇవ్వడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని...