Addam News
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 10:30 am Posted by : Addam News

ఉప సర్పంచ్‌ల‌కు చెక్ పవర్ రద్దు కాలేదు – తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు – బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

ఉప సర్పంచ్‌ల‌కు చెక్ పవర్ రద్దు కాలేదు
» తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు
– బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 24, అద్దం న్యూస్ :     ఉప సర్పంచ్‌ల‌కు చెక్ పవర్ రద్దు కాలేని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్ద‌ని బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 4700 పై చిలుకు సర్పంచులు విజయం సాధించాగా మిగిలిన రూ.7000లపై చిలుకు గ్రామ పంచాయతీలలో మెజారిటీగా బీసీ ఉప సర్పంచులు 80 శాతం ఉన్నారని, ఇలాంటి తప్పుడు లీకులిచ్చిన వారిని ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్‌ల‌కు చెక్ పవర్ రద్దుపై కొంత గందరగోళం నెలకొందని, కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపిడివో, సర్పంచ్, ఎంపిపి డిజిటల్ సంతకాలతో పేమెంట్స్ జరుగుతాయని పేర్కొందని వివ‌రించారు. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉప సర్పంచ్‌ల‌కు చెక్ పవర్ రద్దుగా ప్రచారమైందని, వాస్తవానికి ఉప సర్పంచ్ చెక్ పవర్ తొలగించలేదన్నారు. తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజానీకం తిప్పి కొట్టాల‌న్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఆధిపత్య వర్గాలకు చెందిన వ్యక్తులు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమంలో వారిని దోషులుగా నిలబెడతామని విక్రమ్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం కార్యనిర్వహ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్, నర్సింహా నాయక్, మాదేశి రాజేందర్, ఇంద్రం రజక, గౌతమ్ ప్రజపతి బీసీ నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png