చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి – ఎస్‌సిఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు డిమాండ్
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ( ఎస్‌సిఆర్‌పిఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( షోయబ్ హాల్ ) లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే డిసెంబర్ 7, 2026 నాటికి మూడు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో...