ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి – అఖిలపక్ష నాయకుల డిమాండ్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    భారత ఎన్నికల సంఘం సంస్థాగత స్వతంత్రతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్‌లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేత‌ల‌ సమావేశం జ‌రిగింది. ఖైరతాబాద్ డీసీసీ...