Addam News
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 3:08 am Posted by : Addam News

అంతర్జాతీయ కళాకారుడు రామ్ నాయక్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సిటీ క‌ల్చ‌ర‌ల్‌, జూన్ 18, అద్దం న్యూస్ :   తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ తెలుగు సినీ అవార్డుల ప్రధాన మహోత్సవ జ్ఞాపికను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రామ్ నాయక్ ను అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ ఆటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చేతుల మీదుగా రామ్ నాయక్ సన్మానం అందుకున్నారు. ఆయన రూపొందించిన జ్ఞాపికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసును కూడా గెలుచుకున్న నిజమైన కళాకారుడు అవడం నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంతర్జాతీయ పర్యావరణవేత్త అధ్యక్షుడు భద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. రామ్ నాయక్ అనేక అంతర్జాతీయ వేదికల మీద మన తెలుగు మన తెలంగాణ కళారంగాన్ని తన ఆర్ట్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారని, అమెరికాలో, లండన్లో, కెనడాలో, దుబాయిలో అనేక అంతర్జాతీయ వేదికల మీద తను గీసిన బొమ్మలు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసాయని వ‌క్త‌లు అభినందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png