ఉద్యమకారుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు – తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ప్రొఫెసర్ కోదండరాం
తార్నాక, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మోతే శోభన్ రెడ్డిలను ఉద్యమకారులు కోరారు. శనివారం తార్నాకలోని ప్రొఫెసర్ కోదండరాం ను ఆయన ఇంటి వద్ద టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపూల్ రామ్ రెడ్డి తో పాటు ప్రధాన కార్యదర్శి కల్లపు చంద్రన్న ప్రసాద్, అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, 1969 ఉద్యమకారులు రంగారెడ్డి, శంకర్‌రావు, అంతారి...