భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఈ మేర‌కు ఆదివారం మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని క‌లిసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు...