పిల్ల‌ల్లారా జాగ్ర‌త్త‌.. డ్ర‌గ్స్‌, మ‌తం.. మ‌త్తు చాలా ప్ర‌మాదం – సినీ న‌టుడు అజ‌య్ ఘోష్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : పిల్ల‌ల్లారా జాగ్ర‌త్త‌గా ఉండండి.. డ్ర‌గ్స్‌, మ‌తం.. మ‌త్తు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌నీ, వాటి మ‌త్తులో ప‌డి జీవితాల‌ను ఆగం చేసుకోవ‌ద్ద‌ని సినీ న‌టులు అజ‌య్ ఘోష్ హెచ్చ‌రించారు. మంచి పుస్త‌కాలు చ‌ద‌వాల‌ని, చ‌రిత్ర తెలుసుకోవాల‌ని సూచించారు. ఆదివారం హైద‌రాబాద్‌లోని బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యువ‌జ‌న, సాంస్కృతిక‌, టూరిజం శాఖ‌ల స‌హ‌కారంతో ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నిర్వ‌హించిన భ‌గ‌త్‌సింగ్ యువ‌జ‌న క్రీడోత్స‌వాల ముగింపు స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అజ‌య్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజ‌రై క్రికెట్‌, ఖోఖో, వెయిట్...