Addam News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:35 am Posted by : Addam News

సికింద్రాబాద్‌లో ఈ నెల 10న క్రైస్తవ ఐక్యత సమావేశం

తార్నాక, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    గ్లోబల్‌ పీస్‌ ప్రేయర్ ( జీపీ ), నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్ ( ఎన్‌సీసీ ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీన‌ సికింద్రాబాద్‌లో క్రైస్తవ ఐక్యత సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్‌సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్‌ సంజయ్‌ ఆనంద్‌ తెలిపారు. తార్నాకలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 10 వ తేదీన ఉదయం 9 గంటలకు సప్తగిరి హోటల్‌ వెనుక ఉన్న అమృతవాణి కమ్యూనికేషన్‌ సెంటర్‌లో సమావేశం జరుగుతుందని చెప్పారు. ‘ మన ఐక్యత–మన భవిష్యత్తు ’, ‘ ఒక్క గొంతు–ఒక్క లక్ష్యం ’, ‘ ఐక్యతే మన గుర్తింపు ’ నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, ప్రొఫెసర్‌ కోదండరాం, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి దీపక్‌ జాన్‌, నాగరికరి ప్రీతమ్‌, డాక్ట‌ర్‌.ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, తీన్మార్‌ మల్లన్న తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. జీపీ ఫౌండర్ డాక్ట‌ర్‌.ప్రభు డిడి, ఎన్‌సీసీ తెలంగాణ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ బిషప్‌ బక్క ఏలీయా తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. క్రైస్తవ సమాజంలో ఐక్యత, విశ్వాసం, భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. క్రైస్తవ విశ్వాసులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.