Addam News
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 8:04 am Posted by : Addam News

అమ‌లు కానీ హామీల‌ను ఇచ్చి త‌ప్పించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

స‌మావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా


అమ‌లు కానీ హామీల‌ను ఇచ్చి త‌ప్పించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా


హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ :     అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి ఎన్ని రోజులు తప్పించు కుంటారని, హామీలు ఇచ్చే ముందు సాధ్యా అసాధ్యాలను పరిశీలించకుండా తలెత్తే పరిణామాలను గమనించకుండా అధికారం కోసం ఇష్టమొచ్చిన రీతిలో వాగ్దానాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైదని కాదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… జాబు క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మోసం చేసినందుకు గాను మొన్న రెండు రోజుల క్రితం నిరుద్యోగులందరూ సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లడం జరిగిందన్నారు. ఆరోజు అధికారుల, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి బ‌య‌ట‌కు వెళ్లిపోయారన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నిస్తే వారిని పాశవికంగా పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేసారని విమ‌ర్శించారు. ప్రజా ఉద్యమాన్ని అణిచి వేయడం ఎవరి తరం కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎవరైనా ప్రజా ఉద్యమాలు చేపడితే పోలీసులతో బెదిరించడం, అణిచివేయాలని చూడడం అవివేకమైన చర్య అని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయాలని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరును ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నిజాన్ని నిర్బయంగా చెప్పడం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయడం పత్రికల, ప్రసార మాధ్యమాల ప్రధాన కర్తవ్యమ‌న్నారు. దేశాభివృద్ధిలో పత్రికల పాత్ర కూడా ఎంతో ఉందని, పత్రికలపై దాడిని త్రీవ్రంగా ఖండిస్తూ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో పత్రికలకు పూర్తి స్వేచ్చ ఇచ్చారన్నిరు. ప్రజాస్వామ్య బద్దంగా పరిష్కారం చేసుకోవాలని, కాని పత్రికలు తమకు అనుకూలంగా రాయలేదని బెదిరింపులకు దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమ‌న్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png