సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తి చేయడానికి వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేయాలి –ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ని విజ్ఞ‌ప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాయ్‌పూర్‌, ( అద్దం న్యూస్ ) :    ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తి చేయడానికి వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను...