Addam News
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 3:00 am Posted by : Addam News

దళితులకు రూ.12 లక్షల ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

దళితులకు రూ.12 లక్షల ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
– బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్

హైద‌రాబాద్‌, జూలై 19, ( అద్దం న్యూస్ ) :   ద‌ళిత బంధు త‌ర‌హా ప‌థ‌కాన్ని తీసుకొచ్చి దళితులకు రూ.12 లక్షలను ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర మోసం చేశార‌ని బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ అన్నారు. బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ప‌రిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం ఆదివారం భోల‌క్‌పూర్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ…. సీఎం రేవంత్‌రెడ్డి ద‌ళితుల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. కెసిఆర్ హ‌యాంలో ఇచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తామ‌ని… కెసిఆర్ రూ.10 ల‌క్ష‌లు ఇస్తే తాను అధికారంలోకి రాగానే రూ.12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇస్తామ‌ని రేవంత్‌రెడ్డి హామినిచ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా నేటికి ఒక్క రూపాయి ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. దీని పై త్వ‌ర‌లోనే బిజెపి ఎస్సి మోర్చ మ‌హంకాళి జిల్లా ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేప‌ట్ట‌నున్న‌ట్లు న‌వీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చ నాయకులు పరమల్ కుమార్, నంద‌గిరి నరసింహా, జి.వెంకటేష్, కృష్ణ‌, ఎస్.రాజు, నరేష్, శ్యామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png