విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
» DTU విద్యా సదస్సులో ప‌లువురు వ‌క్త‌లు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 26, ( అద్దం న్యూస్ ) :   సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్నాడని, తెలంగాణలో పూర్తిగా విద్యాశాఖను తన వద్దే ఆ శాఖను పెట్టుకుని బ్రష్టు పట్టిస్తున్నాడని ప‌లువురు వ‌క్త‌లు అన్నారు. బుధవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షతన ధ‌ర్మ టీచ‌ర్స్ యూనిటి ( డిటియు ) విద్యా సదస్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సుకు మాజీ ఎమ్మెల్సీ జాతీయ విశ్లేషకులు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్ట‌ర్‌.విశారదన్ మహారాజ్, ప్రొఫెసర్ లింబాద్రి మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ కూరపాటి వెంకట్ నారాయణ, ఎంవికె ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ టి.చిరంజీవి, పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఆచార్యులు నాగం కుమార్ స్వామి త‌దిత‌రులు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా విశార‌ద‌న్ మ‌హారాజ్ మాట్లాడుతూ… ప్రభుత్వ బడులు కాలేజీలు యూనివర్సిటీలో భవనాల నిర్మాణం లేదు, బోధన సిబ్బంది అసలే లేరన్నారు. కోట్లాది రూపాయలు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పెండింగ్ ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలతో ఈ సీఎం విద్యా శాఖ మంత్రిగా ఉండి వారి జీవితాలతో చెలగాడ మాడుతున్నారని ఆరోపించారు. విద్యారంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆకలి కడుపులో తోటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు పడతాయని యూనివర్సిటీల చుట్టూ బిసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ‌ని దద్దమ్మ ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లతో పాటు విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలోంచి పోరాడి సాధించబోతుందని అన్నారు.

మాజీ ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవి హాజ‌రై మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు పాఠశాలల్లోనే నిర్మితమవుతుందని, ప్రభుత్వ విద్యను బలహీనపరిస్తే సామాజిక న్యాయం దెబ్బతింటుందని అన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ… విద్యా వ్యవస్థ సామాజిక న్యాయానికి వేదికగా మారాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటం పాఠశాలల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దామెర ఉపేందర్ సమన్వయం చేసిన‌ ఈ కార్య‌క్ర‌మంలో డాక్టర్‌ రాజన్‌, విద్యానంద్‌, డాక్టర్‌ నాగన్‌ కుమారస్వామి, డాక్టర్‌ ప్రభాకర్‌ చౌటీ, ఎకనామిక్స్ ఫైనల్ గ్రూప్‌-సివిల్ సర్వీసెస్ అధినేత చౌటి ప్రభాకర్, ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర నాయ‌కులు నాదరి రమేష్, కొత్తూరు రాజు, అశోక్, జంగం అంజన్న బాబు, జనార్ధన్, భూపతి, సుధాకర్, వేణు, దేవయ్య, పారిజాత, రామగిరి, అశ్విని, శివగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page