Addam News
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 9:12 am Posted by : Addam News

‘ ఇందిరమ్మ సూక్తులు ’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ సిటీ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :     సోనియా గాంధీ ముందుమాటతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుగులో ప్రచురింపజేసిన ‘ ఇందిరమ్మ సూక్తులు ’ పుస్తకాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రై ‘ ఇందిరమ్మ సూక్తులు ’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేయగా, ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బిఎం.సందీప్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇతర పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో వచ్చిన ఇందిరా గాంధీ సెలెక్టెడ్ సేయింగ్స్ ని తెలుగులో ఇందిరమ్మ సూక్తులు పేరుతో డాక్ట‌ర్‌.పొన్నం రవిచంద్ర, డాక్ట‌ర్‌.మామిడి హరికృష్ణ, శ్రీ లక్ష్మి అనువదించగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెలువరించారు. తొలుత ఈ పుస్తకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కన్నడ భాషలో వెలువరించారు.

     తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆలోచనలు, సందేశాలు, సూక్తులను చేరువ చేయాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేశారు. ఇందిరా గాంధీ ఆలోచనలు, ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేసే దిశగా ‘ ఇందిరమ్మ సూక్తులు ’ పుస్తకం ఒక మంచి ప్రయత్నంగా నిలవనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకానికి సోనియా గాంధీ రాసిన ముందుమాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు.