‘ ఇందిరమ్మ సూక్తులు ’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : సోనియా గాంధీ ముందుమాటతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుగులో ప్రచురింపజేసిన ‘ ఇందిరమ్మ సూక్తులు ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ‘ ఇందిరమ్మ సూక్తులు ’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేయగా, ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ...