Addam News
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 4:09 pm Posted by : Addam News

ఉగ్రదాడి మృతులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

 

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : జమ్ము కశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రివర్గ సహచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png