తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి – తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పి.సాయిబాబా

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడం, అందుకోసం తిరుపతి లెటర్ల కోసం పాకులాడటం ఏంటని జనాలను ఉద్దేశించి రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉందని తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో...