ఎల్‌నినో ప్ర‌భావం, వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ఈ నెల 12న‌ మంత్రుల‌తో సీఎం ప్ర‌త్యేక స‌మావేశం

తెలంగాణ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :       రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై...