డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయండి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌ను కోరిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. బుధవారం ఆమె జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధి పై చర్చించారు. అలాగే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ పావని కోరారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్‌కు కార్పొరేటర్ పావని అందచేశారు. అందుకు సానుకూలంగా...