Addam News
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 8:48 pm Posted by : Addam News

సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ ప‌నుల‌ను పూర్తి చేయండి –అధికారుల‌ను ఆదేశించిన కార్పొరేటర్ ఎ.పావని

సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ ప‌నుల‌ను పూర్తి చేయండి
» అధికారుల‌ను ఆదేశించిన కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఆమె జలమండలి అధికారులతో కలిసి వివిగిరిన‌గ‌ర్ బ‌స్తీలో పర్యవేక్షించారు. బస్తీలో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడారు. అనంతరం రానున్న సంక్రాంతి పండగ లోపు బ‌స్తీ వాసులకు మంచినీటి సరఫరా, సివ‌రేజి వ్యవస్థ పట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని, మంచినీటి లో ప్రెషర్ సమస్య పరిష్కరించే దిశగా నీటి సరఫరా సమయాన్ని మరో గంటపాటు పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేట‌ర్ పావ‌ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జలమండలి డిజిఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ శంకర్, వారి సిబ్బంది, బిజెపి నేతలు దామోదర్, విజయ లక్ష్మి, సాయి కుమార్, సాయికృష్ణ యాదవ్, బస్తీ వాసులు నర్సింగ్ రావు, శ్రీనివాస్, సాయి, చందు, లక్ష్మి, రేవతి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png