Addam News
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:36 am Posted by : Addam News

ద‌ళితుల‌కు మోసం చేసింది కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలే – బిజెపి ఎస్సీ మోర్చా మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గడ్డం న‌వీన్

ద‌ళితుల‌కు మోసం చేసింది కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలే
– బిజెపి ఎస్సీ మోర్చా మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గడ్డం న‌వీన్

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :   ద‌ళితుల‌కు మోసం చేసింది కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలే అని బిజెపి ఎస్సీ మోర్చా మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గడ్డం న‌వీన్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ద‌ళితుల‌కు అంబేద్క‌ర్ ద‌ళిత బంధు ఇస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఘోరంగా మోసం చేసింద‌ని విమ‌ర్శించారు. బిఆర్ఎస్ పార్టీ సైతం ద‌ళితుల‌ను అన్ని విధాలుగా విస్మ‌రించింద‌న్నారు. ద‌ళితులను రాజ‌కీయాల‌లోకి లాగొద్ద‌న్నారు. ద‌ళితుల గురించి కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల నాయ‌కులకు మాట్లాడే హ‌క్కులేద‌న్నారు. బిజెపిలో ద‌ళితుల‌కు స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.రాజు, బిజెపి ప్రధాన కార్యదర్శి అజయ్, బిజెపి ఎస్సీ మోర్చా స్పోక్‌ పర్సన్ ఎర్రోళ్ల సతీష్, బిజెపి బ‌న్సిలాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు మహేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png