ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ బ‌డ్జెట్‌ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన పేరుతో కొండంత ప్రచారం చేసి అతికష్ట మీదట కులగణన పూర్తిచేసి సంపూర్ణంగా బలహీన వర్గాల సంఖ్య తేలకుండానే తమకు తోచింది చేస్తూ, 42 శాతం బీసీలు రిజర్వేషన్లు కల్పిస్తామని అదరబాదరా బిల్లు పెట్టి రాబోతున్న ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడలోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... కాంగ్రెస్...