Addam News
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 3:19 am Posted by : Addam News

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం – బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
– బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ ఆరోపించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శుక్రవారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోలక్‌పూర్ లేబ‌ర్ అడ్డా వ‌ద్ద వంటావార్పు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముఠా జైసింహా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి వంటావార్పును నిర్వ‌హించారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పింఛన్‌ కోసం దివ్యాంగులు ఏటీఎం నమూనాతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జైసింహ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఇకనైనా ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు.

ఎన్నికల హామీలు మాటల్లో కాదు… ప్రజల జీవితాల్లో అమలు కావాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేటర్‌ వి.శ్రీనివాసరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, రేషం మల్లేష్‌, అజ‌య్ ముదిరాజ్‌, రెబ్బ రామారావు, ముఠా న‌రేష్‌, ఆర్‌.శ్రీనివాస్‌, మహ్మద్‌ అలీ, మోయిన్‌, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, హ‌రీష్‌, శ్రీకాంత్‌ ముదిరాజ్‌, శంకర్‌గౌడ్‌, రహీం, ప్ర‌వీణ్‌, దీన్‌దయాల్‌రెడ్డి, వల్లాల శ్రీనివాస్‌యాదవ్‌, బ‌ల‌వంత్‌, మ‌హిళా కార్య‌క‌ర్త‌లు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png