అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
– బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్
హైదరాబాద్, సెప్టెంబర్ 9, ( అద్దం న్యూస్ ) : అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేసేందుకు గురువారం బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో బస్తీ బస్తీ తిరిగే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్లోని బాకారం, శివస్థాన్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్‌లను ప్రజలకు అందచేశారు. ఈ సందర్బంగా రేషం మల్లేష్ మాట్లాడుతూ… ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మళ్లీ కెసిఆరే అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిగిరి శ్యామ్, కల్వ గోపి, అజయ్ ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, రాకం సత్యనారాయణ, సునీల్, అమిత్, బన్నీ, అరుణ్, రాజేష్, నీలమ్మ, తులసి, సాలమ్మ, అనురాధ, సబిత, శశికళ, గీతారెడ్డి, లలిత, భాగ్య, రజిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply