తాగునీటి సమస్య పై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, అద్దం న్యూస్ : తాగునీటి సమస్య పై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. బుధవారం నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... నగర శివారు ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మంచినీటి కొరతను తీర్చాలంటూ గతంలో ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మంచి నీటి కొరత సమస్య రాను రాను తీవ్రరూపం దాల్చి, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా కాంగ్రెస్...