బూటకపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ
హైదరాబాద్, అద్దం న్యూస్ : “గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తా” అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబ అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 1వ తారీకు జీతాలు అందించలేక అప్పుల కోసం వెంపర్లాడుతున్న ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించి యువతను ఆదుకుంటామని చెప్పడం రాజకీయంగా బూటకపు వాగ్దానమని సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా...