పేదల అభివృద్ధి కోసం ప్రయోజనకరమైన పథకాలను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : పేదల అభివృద్ధి కోసం ప్రయోజనకరమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని గురువారం గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీ లత రెడ్డి మాట్లాడుతూ... “సన్నబియ్యం పంపిణీ పథకం పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో రూపొందించిందన్నారు....