బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు – రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్‌బాగ్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో బీసీలే తగిన గుణపాఠం చెబుతారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలను...