ఫీజుల బకాయిలను చెల్లిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది
లేదంటే అధికారం నుండి తొలగిపోతుంది
– అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి
» రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 10, ( అద్దం న్యూస్ ) : ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీసీ విద్యార్థుల ఉద్యమాన్ని కొనసాగించాలని, ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్లెస్‌క్లబ్‌లో గురువారం కోర్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… ఫీజుల స్కీముపై సీఎం రాద్ధాంతం చేయకుండా వెంటనే 8 వేల కోట్లు బకాయిలు ఇవ్వాలని, బకాయిలు ఇవ్వకపోతే కోర్సు అయినా వారు 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయని ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ఇస్తే సర్టిఫికెట్లు తీసుకుంటారన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లపై ఉన్న “ స్టే ” తొలగించాలని కోరారు. ప్రభుత్వము సీనియర్ అడ్వకేట్లను పెట్టి వాదించాలి. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రిని కలిసి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో పెట్టడానికి కృషి చేయాలని కోరారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం ఆపివేశారని, వెంటనే 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి ప్రతి కుటుంబానికి బీసీ బందు పథకం ద్వారా 20 లక్షల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. చదువుకునే పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు, ఫీజుల పట్ల ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేకత ఉండరాదని… ఆ పద్దతిని మార్చుకోవాలని హితవు పలికారు. ఫీజులు, స్కాలర్‌షిప్‌లు రాక గత రెండు సంవత్సరాలు కోర్స్ పూర్తి చేసిన 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయన్నారు. ఫీజుల స్కీము పై ఏర్పడిన గందరగోళం వలన 30 వేల మంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదన్నారు. అలాగే పిజి అడ్మిషన్లలో ముఖ్యంగా ఎంబీఏ అడ్మిషన్లలో 50 శాతం సీట్లు భర్తీ కాలేదని తెలిపారు. డిగ్రీ కాలేజిలో 70 వేల సీట్లు మిగిలిపోయాయని, అందుకే పాత పద్ధతినే యథాతధంగా కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బిసి కులాల ఐక్య వేదిక అనంతయ్య, బిసి యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply