Addam News
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 11:36 pm Posted by : Addam News

విజయశాంతిని కలిసిన కాంగ్రెస్ నేతలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్‌ : ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా లేబర్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, బాలకృష్ణ గుప్తా తదితరులు మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని విజయశాంతి సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png