Addam News
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 10:25 am Posted by : Addam News

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమే   – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా    

హైదరాబాద్, ఆగస్టు 23, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమే అని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రాధాన్యత లేని పదవులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉన్న పదవులన్నీ అగ్రవర్ణాలకు కట్టబెడుతూ, బలహీన వర్గాల సంక్షేమ అంటూ బూటకపు వాగ్దానాలేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు ఒక మాదిరిగా, చేతలు మరో మాదిరిగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ లో ఈనాటికి అగ్రకులాల పెత్తనమే తప్పితే, పేద బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆలోచించవద్దన్నారు. మొన్నటికి మొన్న సమాచార కమిషనర్ సభ్యులను నలుగురిని అగ్రకులాల వారినే నియమించారని.. ఇదేమి న్యాయమని అన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి కేంద్రం మెడలు వంచైనా బిసి రిజర్వేషన్లు తెస్తాననేది కుయుక్తులేనని ప్రజలందరూ గమనించాలన్నారు. నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా జస్టీస్ సుదర్శన్ రెడ్డికి కట్టబెడుతూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల దోరణికి నిదర్శనమని అన్నారు. మాట్లాడితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకోవడం కాదు… అసలు బీసీలకు ఏం చేశారో చెప్పాలని సాయిబాబా అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలపై కపట ప్రేమ నటిస్తూ పనికి రాని పదవులన్నీ బిసిలకు కట్టబెడుతూ, ప్రాధాన్యత గల పదవులన్నీ రెడ్డిలకు అగ్రవర్ణాలకు కట్టబెడుతున్నా నోరు మెదపని కాంగ్రెస్ బిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ వాస్తవాలను గ్రహించి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేతిలో మహేష్ గౌడ్ కీలుబొమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png