కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమే   – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా    

హైదరాబాద్, ఆగస్టు 23, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమే అని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రాధాన్యత లేని పదవులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉన్న పదవులన్నీ అగ్రవర్ణాలకు కట్టబెడుతూ, బలహీన వర్గాల సంక్షేమ అంటూ బూటకపు వాగ్దానాలేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు ఒక మాదిరిగా, చేతలు మరో మాదిరిగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ లో...