రాజ్యాంగం అంటే శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణిక గ్రంథం – తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు

హైదరాబాద్, అద్దం న్యూస్ :   భారత రాజ్యాంగం పది కాలాల పాటు పదిలంగా వర్ధిల్లాలంటే పల్లె పల్లెన కళాకారులచే ప్రచారం చేయాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టిపిఎస్‌కె హాల్‌లో మంచికి శ్రీకారం ఉగాది పండుగ రోజున భారత రాజ్యాంగ శ్రవణం చేశారు. అనంతరం భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటికి రాజ్యాంగమే దేశానికి రహదారి అని కొనియాడారు. జ్యోతీష్యానికి శాస్త్రీయ ప్రమాణాలు లేవని... ముందు జరగబోయేది ఎవ్వరూ చెప్పలేరన్నారు....