పోక్సో కేసుల్లో సత్వర న్యాయానికి.. పోలీసులు, వైద్యుల సమన్వయం ముఖ్యం – ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో నగర సీపీ సజ్జనర్ సమన్వయ సమావేశం
హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 5, ( అద్దం న్యూస్ ) : మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో బాధితులకు వేగంగా న్యాయం చేకూరాలంటే పోలీసులు, వైద్యుల మధ్య మెరుగైన సమన్వయం అత్యంత ఆవశ్యకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన సుమారు 34 మంది వైద్యాధికారులతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్యాప్తు ప్రక్రియలోనూ, న్యాయస్థానాల్లో నేరం నిరూపించడంలోనూ వైద్యులు ఇచ్చే నివేదికలే...