పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ మాజరై చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పిల్లలతో నూతన బలక బలపంతో అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ఉన్నతమైన స్థానాలలో ఉన్నారన్నారు. జవహర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా...