అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, మే 26, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప‌లు పార్కుల్లో ఇటీవ‌ల మంజూరు చేయించిన 26 ల‌క్ష‌ల నిధుల‌తో కొన‌సాగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ప‌లు పార్కుల్లో అభివృద్ధి ప‌నుల కోసం తాను రూ.26 ల‌క్ష‌ల నిధుల‌ను మంజూరు చేయించ‌డం జ‌రిగింద‌న్నారు. అందులో భాగంగా డివిజ‌న్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ టిఆర్‌టి గ్రౌండ్ ప్ర‌హ‌రిగోడ నిర్మాణం, సుర‌భి పార్కు, కెన‌రా పార్కుల్లో ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. వీటితో...