మస్కిటో ఫాగ్ స్పెషల్ డ్రైవ్, పిన్ పాయింట్ కార్యక్రమాన్ని పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : ఎంటమోలజీ విభాగం సిబ్బంది తో మస్కిటో ఫాగ్ స్పెషల్ డ్రైవ్, పిన్ పాయింట్ కార్యక్రమాన్ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వారంలో ఒక రోజు కాకుండా, పాత విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి రోజూ ఫాగ్ వెహికల్, ఒక హాండ్ పంప్ సిబ్బందితో పనులు జరిపించాలని కార్పొరేటర్ పావని అన్నారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో డివిజన్‌లో ఫాగ్ స్ప్రే జరిగితే మిగిలిన రోజుల్లో ఫిర్యాదులు ఎక్కువ...