Addam News
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 3:11 am Posted by : Addam News

అరుంధతినగర్ బ‌స్తీలో సివరేజి పైప్‌లైన్ పనుల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ :                 ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధతిన‌గ‌ర్ బ‌స్తీలో నూత‌నంగా సివ‌రేజి పైప్‌లైన్ ఏర్పాటు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ శుక్ర‌వారం ప‌రిశీలించారు. దోమ‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం కార్తీక్‌రెడ్డి, మేనేజ‌ర్ కృష్ణ‌మోహ‌న్‌, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. మరో ఇరవై రోజుల్లో జరగనున్న బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మొదలుపెట్టే పనులనుబోనాల పండుగ లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చాలా ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న అరుంధతి నగర్ బస్తి వాసుల కోరిక మేరకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకే నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని కార్పొరేటర్ గారు బస్తి వాసులతో అన్నారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి రాజు, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, ఆనంద్ రావు, నర్సింహ, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సంధ్యా రాణి, పూర్ణ, బ‌స్తీవాసులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png