అరుంధతినగర్ బస్తీలో సివరేజి పైప్‌లైన్ పనుల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో నూతనంగా సివరేజి పైప్‌లైన్ ఏర్పాటు పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. దోమలగూడ వాటర్ వర్క్స్ డిజిఎం కార్తీక్‌రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్‌తో కలిసి కార్పొరేటర్ పావని సివరేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించారు. మరో ఇరవై రోజుల్లో జరగనున్న బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని...