మాన్‌సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వద్ద మంగళవారం మాన్‌సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, జిహెచ్ఎంసి సర్కిల్ – 15 డిప్యూటీ కమిషనర్ రామానుజన్ రెడ్డి, ఏఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ తో కలిసి ప్రారంభించారు. ఎక్కడ ఫిర్యాదులు లేకుండా శానిటేషన్ డ్రైవ్ పూర్తి చేయాలని జిహెచ్ఎంసి సిబ్బందికి కార్పొరేటర్ పావని ఆదేశించారు. వర్షా కాలం దృష్ట్యా రోడ్లు, కాలనీలు, బస్తీల్లో పేరుకుపోయిన మట్టి...