బాబు జగ్జీవన్‌రామ్ జయంతిలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్.బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమం శనివారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో అరుంధతినగర్, ఆంధ్రాకేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో జరిగిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన...