Addam News
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:35 pm Posted by : Addam News

బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్   భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బూత్ నంబ‌ర్ 2 జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ స్కూల్ వ‌ద్ద, బూత్ నంబ‌ర్ 34, స‌బ‌ర్మ‌తిన‌గ‌ర్ బ్రిడ్జి త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్,బూత్ అధ్యక్షులు శివ, డి.కుమార్, కో-ఆర్డినేట‌ర్లు శైలేష్, రహమత్ అలి, బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సురేష్,శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, ధోనేటి సత్యం, రవి యాదవ్, ప్రశాంత్, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png